మీరు జిమ్ కీ వెళ్లకుండా, కఠినమైన డైట్లూ చేయకుండా అలవోకగా కొన్ని కేలరీలు ఖర్చు చేయడానికి అనువైన మార్గాన్ని అన్వేషిస్తున్నారా? సరే, మీ కోసం నా దగ్గరో ఉపాయం ఉంది చెప్పమంటారా: మంచి హోస్ట్‌గా ఉండండి! అవును, మీరు విన్నది నిజమే.
మీ ఇంటికో మిత్రుడో, బంధువో లేదా ఎవరైనా అతిధులో వచ్చినప్పుడు, దయచేసి లేవండి. అవును ఊరికే మంచానికి సాగిలపడి హాయ్ అంటూ చేతులు ఊపుతూ కూర్చోకండి. వారిని చిరునవ్వుతో స్వాగతించండి మరియు వారికి తినడానికి లేదా త్రాగడానికి ఏదైనా అందించండి. మీరు షడ్రషోపేతంగా ఖరీదైన విందు భోజనాలు వండి వార్చి వడ్డించాల్సిన అవసరమేమీ లేదు, కేవలం ఒక కప్పు టీ లేదా ఒక గ్లాసు మంచినీళ్లు మరియు అల్పాహారమైన చాలు. వారితో సరదాగా కబుర్లు చెప్పుకోండి మరియు వారి జీవిత విశేషాల పట్ల ఆసక్తి చూపండి. కేవలం తల ఊపి "ఉహ్-హు" లేదా "అది బాగుంది" "ఇది బాగుంది" అని చెప్పి సరి పెట్టకండి. ప్రశ్నలు అడుగుతుండండి, కథలను పంచుకోండి, వారు వేసే జోకులను వింటూ నవ్వుకోండి. ఇది వారిని ప్రశంసించినట్టు ఉండటమే కాక, మీ మెదడు మరియు నోటిని కూడా బిజీగా ఉంచినట్టు అవుతుంది.
మరియు వారు బయలుదేరుతున్నప్పుడు, దయచేసి మళ్లీ లేచి, ఇంటి గేటు వరకు వారితో పాటు వెళ్లండి. కేవలం "బై" అని అరిచి తలుపు వేసుకొని మళ్లీ కుర్చీలో కూలబడకండి. వారితోపాటు గేటు వరకు నడవండి మరియు వారిని కౌగిలించుకోండి లేదా కరచాలనం చేయండి. ఇది మీకు కొన్ని కేలరీలు ఖర్చు చేయడంలో సహాయ పడటమే కాక, అదే సమయంలో అతిధులకు కొంత ప్రేమ మరియు ఆప్యాయతలను అందించినట్లు అవుతుంది. నన్ను నమ్మండి, వారు మీ ఆతిథ్యాన్ని అభినందించటమే కాదు మీరు కూడా మీ తరఫున మంచి అనుభూతిని పొందినవారవుతారు.
ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఈ రోజు నుంచే మంచి హోస్ట్‌గా ఉండటం ప్రారంభించండి మరియు అదిగో ఆ కేలరీలు కరిగిపోవడం గమనిస్తూ ఆనందించండి!
Welcome to Dr. Srikanths Diabetes Specialities Centre [DSDSC]. Introduce yourself and feel free to discuss all areas of Diabetes including symptoms, diabetes news & breakthroughs, lab investigations and treatment aspects like diet, exercise, weight loss, insulin usage, oral drugs and more. The main aim of this blog is to share experiences, knowledge and help increase the understanding / awareness of Diabetes. PLEASE JOIN / FOLLOW THIS SITE TO STAY CONNECTED WITH US.
Saturday, 8 July 2023
మంచి హోస్ట్‌గా ఉండండి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment